Nitin Gadkari: ఎన్నికల ప్రసంగం మధ్యలోనే స్పృహ తప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Nitin Gadkari: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ భారీ బహిరంగ సభలో పాల్గొన్న నితిన్ గడ్కరీ.. మాట్లాడుతుండగానే స్పృహ కోల్పోయారు. అది గమనించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై నితిన్ గడ్కరీ పడిపోకుండా పట్టుకున్నారు. అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.