Axar - Ishan: ఫస్ట్ ఇషాన్ సిక్స్... సెకండ్ అక్షర్ సూపర్ క్యాచ్
ముంబయితో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో దిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు. పదో ఓవర్ బౌలింగ్ చేసిన అక్షర్.. ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టాడు. తొలి బంతికి సిక్స్ బాదిన ఇషాన్ (42).. రెండో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.