హార్దిక్ పాండ్యా బ్యాడ్‌లక్ ఐపీఎల్ 2025లోనూ..! తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధం..!
Hardik Pandya Ban: ఐపీఎల్ 2024లో చివరి మ్యాచులో ఓడి నిరాశలో ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఈ సీజన్‌లో మూడో మ్యాచులో స్లో ఓవర్ రేటు నమోదు చేసినందుకు గానూ ఈ చర్యలు తీసుకుంది. అతడితో పాటు ముంబై ప్లేయర్లందరికీ ఫైన్ విధించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.