Operation Valentine OTT: సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..
మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమలో పూర్తి స్థాయిలో వచ్చిన ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ డ్రామా ఇదే.. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ అందుకుంది. ఇందులో వరుణ్ జోడిగా మానుషి చిల్లర్ కథానాయికగా నటించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు. పుల్వామా అటాక్, బాలాకోట్ వైమానిక దాడులు ఆధారంగా చేసుకుని ఈ డ్రామాను రూపొందించారు.