![IPL 2024: తల్లి హాస్పిటల్‌లో.. షారూఖ్ సందేశంతో అఫ్ఘాన్ నుంచి తిరిగొచ్చిన కోల్‌కతా ప్లేయర్](https://dl.addkart.in/blog/public/default-image/default-730x400.png )
IPL 2024: తల్లి హాస్పిటల్‌లో.. షారూఖ్ సందేశంతో అఫ్ఘాన్ నుంచి తిరిగొచ్చిన కోల్‌కతా ప్లేయర్
Rahmanullah Gurbaz: ఐపీఎల్ 2024 అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ చేరింది. జట్టు ప్లే ఆఫ్స్ చేరిన నేపథ్యంలో జట్టుకు తన అవసరం ఉందని భావించిన ఆ జట్టు వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్.. తన తల్లి అనారోగ్యంగా ఉన్న మ్యాచు ఆడేందుకు వచ్చేశాడు. తల్లి అనారోగ్యంగా ఉందని మే మొదటి వారంలో అఫ్ఘానిస్థాన్ వెళ్లిపోయిన ఈ 22 ఏళ్ల ప్లేయర్.. జట్టుకోసం మళ్లీ వచ్చాడు. ఆస్పత్రిలో ఉన్న తన తల్లి క్షేమసమాచారాలు తెలుసుకుంటూ.. జట్టుకోసం తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.