![India today Exit poll: ఏపీలో వారిదే అధికారం.. సీట్లతో సహా చెప్పిన ఇండియా టుడే సర్వే](https://dl.addkart.in/blog/public/default-image/default-730x400.png )
India today Exit poll: ఏపీలో వారిదే అధికారం.. సీట్లతో సహా చెప్పిన ఇండియా టుడే సర్వే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. శనివారం ఏపీ లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఇండియా టుడే.. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించింది. ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే అధికారమని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కూటమికి 98 నుంచి 120 స్థానాల వరకు వస్తాయని.. టీడీపీ సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.