Dinesh Karthik: ఆర్సీబీ ఓటమి.. దినేశ్ కార్తీక్ షాకింగ్ నిర్ణయం.. కన్నీళ్లతో ఐపీఎల్‌కు వీడ్కోలు!
RR vs RCB: టీమిండియా క్రికెటర్, ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న దినేశ్ కార్తీక్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో.. తన ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. కన్నీటితో మైదానాన్ని వీడుతుండగా.. సహచర ఆర్సీబీ ఆటగాళ్లు అతడికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. దీంతో ఐపీఎల్‌లో డీకే తన చివరి మ్యాచ్ ఆడేసినట్లే తెలుస్తోంది.