కోహ్లి రికార్డ్ బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి భారత ప్లేయర్‌గా ఘనత..!
ఐపీఎల్ 2024లో సిక్సర్ల మోత మోగిస్తోన్న సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సులు బాదిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. 2016 సీజన్లో పరుగుల వరద పారించిన కోహ్లి.. ఆ సీజన్లో 38 సిక్సులు బాదగా.. అభిషేక్ శర్మ ఈ సీజన్లో ఇప్పటి దాకా 41 సిక్సులు బాదాడు.