![ఆర్సీబీకి అంబటి రాయుడు సలహా.. భగ్గుమంటోన్న బెంగళూరు ఫ్యాన్స్..!](https://dl.addkart.in/blog/public/default-image/default-730x400.png )
ఆర్సీబీకి అంబటి రాయుడు సలహా.. భగ్గుమంటోన్న బెంగళూరు ఫ్యాన్స్..!
ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు ఓడిపోవడంతో కప్ కొట్టాలనే ఆర్సీబీ ఆశలు ఈ ఏడాది కూడా నెరవేరలేదు. ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌ను ఊరడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన రాయుడు.. టీమ్ మేనేజ్‌మెంట్, నాయకత్వం గనుక జట్టు ప్రయోజనాలకు పెద్ద పీట వేసి ఉండుంటే ఆర్సీబీ ఇప్పటికే ఐపీఎల్ టైటిళ్లు గెలిచిదన్నాడు. వ్యక్తిగత మైలురాళ్లు అనే అంశాన్ని ప్రస్తావించడం ద్వారా పరోక్షంగా కోహ్లిని రాయుడు టార్గెట్ చేశాడని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.